BHIM NEWS

Telugu News Channel

రైల్వేలో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

1 min read
Spread the love

విజయవాడ: నవంబరు 01 (భీమ్ న్యూస్) రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్.ఆర్.సి.), సెంట్రల్ రైల్వే (సి.ఆర్.) కామన్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (జీ.డి.సి.ఈ.) ద్వారా స్టెనోగ్రాఫర్, సీనియర్ కామన్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్ తో పాటు..ఇతర పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా 596 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrccr.com ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 28 అక్టోబర్ 2022 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 28 నవంబర్ 2022. విభాగాల వారీగా పోస్టుల వివరాల్లోకి వెళ్తే,

స్టెనోగ్రాఫర్ 04, సీనియర్ కమ్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్ 154, గూడ్స్ గార్డ్ 46, స్టేషన్ మాస్టర్ 75, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ 150, జూనియర్ కమ్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్ 126, అకౌంట్స్ క్లర్క్ 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 596 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 50 నిమిషాల ట్రాన్స్‌క్రిప్షన్ సమయంతో పాటు 10 నిమిషాల వ్యవధికి నిమిషానికి 80 పదాల షార్ట్‌హ్యాండ్ వేగం కలిగి ఉండాలి. ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా దాని తత్సమానం కలిగి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు 42 ఏళ్లు, ఇతర వెనుకబడిన తరగతులు 45 ఏళ్లు, రిజర్వ్‌డ్ కేటగిరీ (ఎస్సీ/ఎస్టీ) 47 ఏళ్ల వయోపరిమితి ఉండాలని పేర్కొన్నారు.

రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా రైల్వేలో ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం ఎంపిక చేయబడతారు. పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ రైల్వే రిక్రూట్‌మెంట్ అనేది ఆర్.పీ.ఎఫ్./ ఆర్.పి.ఎస్.ఎఫ్. సిబ్బంది కాకుండా, సెంట్రల్ రైల్వేలో సేవలందిస్తున్న ఇతర రెగ్యులర్ రైల్వే ఉద్యోగులందరికీ అని నోటిఫికేషన్ లో తెలిపింది.

5 thoughts on “రైల్వేలో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *