BHIM NEWS

Telugu News Channel

కేంద్రీయ విద్యాలయాల్లో 4014 ఖాళీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

1 min read
Spread the love

న్యూఢిల్లీ: నవంబరు 06 (భీమ్ న్యూస్) దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయం (కే.వీ.) పాఠశాలల్లో ఖాళీగా వున్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కే.వి.ఎస్.) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఈనెల 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 4014 పోస్టులను భర్తీ చేయనున్నది. 4014 పోస్టులలో ప్రిన్సిపాల్ 278, వైస్‌ ప్రిన్సిపాల్ 116, ఫైనాన్స్ ఆఫీసర్ 7, సెక్షన్ ఆఫీసర్ 22, పీజీటీ 1200, టీజీటీ 2154, హెడ్ మాస్టర్ 237 చొప్పున ఖాళీలు వున్నాయి. విద్యార్హతలుగా సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్ డిగ్రీ, బీ.ఈ.డీ.లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై, సీ.టెట్‌లో అర్హత సాధించాలి. ఈ ఉద్యోగాలను డిపార్ట్‌మెంట్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (ఎల్.డి.సీ.ఈ.) ద్వారా ఎంపిక చేయనున్నారు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://kvsangathan.nic.in వెబ్‌సైట్‌ లో చూడవచ్చు.

2 thoughts on “కేంద్రీయ విద్యాలయాల్లో 4014 ఖాళీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *