BHIM NEWS

Telugu News Channel

తాడేపల్లి గూడెం వీరంపాలెం అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం

1 min read
Spread the love

భీమ్ న్యూస్: తాడేపల్లి గూడెం (నవంబరు 26) పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజవర్గం వీరంపాలెం గ్రామంలో భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు సందర్భంగా వీరంపాలెం యూత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం యూత్ సభ్యులందరూ బైక్ ర్యాలీని నిర్వహించి, కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ శనివారం రాష్ట్రంలోని ప్రభుత్వాలు కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి డిపార్ట్మెంట్ కూడా భారత రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వహించకుండా సొంత ఎజండాతో కార్యక్రమాలు చేశారు. కొంత మంది ప్రజా ప్రతినిధులు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ప్రజలకు రాజ్యాంగ హక్కుల్ని కల్పించలేక పోతున్నారు. రాజ్యాంగం అంటే విలువ లేదు, చట్టాలంటే విలువ లేదు న్యాయ స్థానాలు అంటే విలువ లేదు. ఇదేనా అంబేడ్కర్ కోరుకున్న రాజ్యాంగంఅని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడైతే రాజ్యాంగానికి విలువ ఇచ్చి రాజ్యాంగ పరంగా ప్రభుత్వాలు పని చేస్తాయో అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని అంబేడ్కర్ యూత్ అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో శశి కుమార్, పెండం భాస్కర్, సకినాల కుమార్, ఎడ్ల షాచిన్, పెండెం నరేష్, సకినాల సాదియా, సకినాల మురళి, పొనమాల అలీ, మానుకొండ సురేష్, కృష్ణ కాంత్, చిరంజీవి, విజయ్ కుమార్, రఘు, భీమారావు, రాజు, సతీష్, గణపతి, కిషోర్, వంశీ, బాలాజీ, పీతల సోమరాజు పాల్గొన్నారు.

3 thoughts on “తాడేపల్లి గూడెం వీరంపాలెం అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *