సనాతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ అర్చకుడికి ఘన సన్మానం
1 min read
భీమ్ న్యూస్: మర్రిపాడు (మార్చి 24) నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీ.సీ. పల్లిలో బ్రాహ్మణ అర్చకుడు బాలగంగాధర్ తిలక్ ను సనాతన పౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు బొద్దుకూరి నారాయణరావు మాట్లాడుతూ విదేశీ మతమార్పిడిని ఒక్కడే అడ్డుకుని, మత మార్పిడి మాఫియాకు ముచ్చెమటలు పట్టించిన బ్రాహ్మణ అర్చకుడు బాలగంగాధర్ తిలక్ క్ ను సనాతన పౌండేషన్ ఆధ్వర్యంలో సత్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. తిలక్ కు ధైర్యం చెప్పి, ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఫౌండేషన్ తరపునా చేస్తామని హామీ ఇచ్చామన్నారు. హిందువులకు తిలక్ సేవలు అవసరమని, అవసరమైన ప్రదేశాల్లో తిలక్ బోధనలు వినియోగిస్తామని తెలిపారు. అనంతరం జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో సనాతన ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.