BHIM NEWS

Telugu News Channel

368 వజ్రాలతో 5.7 కోట్లు ఖరీదైన వాచ్ ధరించిన పాప్ సింగర్ రిహన్న

1 min read
Spread the love

భీమ్ న్యూస్: డెస్క్ (జూన్ 23) అమెరికన్ పాప్ సింగర్స్‌లో ఒకరైన రిహన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె సింగర్‌ గానే కాకుండా నటిగా కూడా రాణిస్తున్నారు. తన నటనతో, సింగింగ్ స్టైల్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న బ్యూటీ, నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది. టాప్‌లెస్ స్టిల్స్‌తో, ఎక్స్‌ఫోజింగ్‌తో నెట్టింట అందాల విందు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ క్రమంలోనే మరోసారి నెట్టింట హల్ చేస్తుంది రిహన్న. ఎవరైనా చేతికి వాచ్ ధరిస్తారు. కానీ ఈ బ్యూటీ మాత్రం మెడకు వాచ్‌ను చోకర్‌లా ధరిస్తుంది. అది కూడా సాదా సీదా వాచ్ కాదు, వజ్రాల వాచ్. ధగ ధగ మెరిసిపోతున్న ఆ వాచ్ అందరి మనసు కొల్లగొట్టింది. ఈ వాచీలో మొత్తం 368 వజ్రాలు పొదిగారు. 47 మిల్లీ మీటర్ల వైట్ గోల్డ్ బ్రిలియంట్ ఫ్లెయింగ్ టూర్ బిల్లన్‌ని చోకర్‌గా ధరించడానికి వీలుగా తయారు చేశారు. ఇంత క్రియేటివిటీ ఉన్న వాచ్ విలువ దాదాపు రూ. 5.7 కోట్లని తెలుస్తుంది. తమ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో రిహన్న వాచ్‌తో ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఈ ఫొటో కాస్త వైరల్ కావడంతో ఈ వాచ్ ధర తెలుసుకుని నెటిజన్లు అవాక్కవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *