BHIM NEWS

Telugu News Channel

ఓటరు జాబితాలో మీ పేరు ఉందా లేదా? ఇలా చెక్ చేసుకోండి.

1 min read
Spread the love

 

                భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (జనవరి 28) ఏపీలో త్వరలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

1) తుది జాబితాను అధికారిక వెబ్ సైట్ లో కూడా ఉంచింది. అయితే మీ వివరాలను ఇలా చెక్ చేసుకోవచ్చు. ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.

2) ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html వెబ్ సైట్ లోకి వెళ్లాలి.(https://ceoandhra.nic.in/)

3) హోమ్ పేజీలోని ఎస్ఎస్ఆర్-2024 లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ పేరు, తండ్రి లేదా భర్త పేరు, వయసు, లింగం వంటి వివరాలను సంబంధిత కాలమ్‌లో నమోదు చేయాలి. (https://ceoandhra.nic.in/)

4) ఆ తర్వాత కింద చూపించే కాలమ్స్ లో మీ జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. క్యాప్చర్‌ కోడ్‌ ఎంటర్‌ చేస్తే వివరాలు డిస్ ప్లే అవుతాయి. (https://ceoandhra.nic.in/)

5) EPIC నెంబర్ ఉంటే చాలా సింపుల్ గా మీ వివరాలు తెలిసిపోతాయి. మొబైల్‌ నంబర్‌ సాయంతోనూ మీ ఓటరు వివరాలు తెలుసుకునే వీలుంది.(https://ceoandhra.nic.in/)

6) https://ceoandhra.nic.in/ వెబ్ సైట్ లో సెర్చ్ యువర్ నేమ్ పేరుతో ఉండే కాలమ్ లో మీ వివరాలు యాడ్ చేసి కూడా ఓటు చెక్ చేసుకోవచ్చు మీ గ్రామం ఓటర్ జాబితా కోసం-ఇదే పేజీలోని పీడీఎఫ్ ఎలక్టోరల్ రోల్స్-అసెంబ్లీ కాన్సిస్ట్యూయన్సీ-ఫైనల్ ఎస్ఎస్ఆర్-2024లో చెక్ చేసుకోవచ్చు. మీ ఓటు కార్డు కనిపించకపోతే… ఎన్నికల అధికారులతో పాటు కలెక్టర్లకు ఫిర్యాదు చేసుకోవచ్చు. (https://ceoandhra.nic.in/)

3 thoughts on “ఓటరు జాబితాలో మీ పేరు ఉందా లేదా? ఇలా చెక్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *