BHIM NEWS

Telugu News Channel

గేదెల పోలూరు గిరిజన గ్రామానికి త్రాగునీటి సమస్యను తీర్చండి: సవర కుమార్

1 min read
Spread the love

భీమ్ న్యూస్ మెలియాపుట్టి ప్రతినిధి (ఫిబ్రవరి 05) శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం గేదలు పోలూరు గిరిజన కాలనీ నుండి కొంతమంది గిరిజనులు వచ్చి, మా గ్రామానికి త్రాగునీటి సమస్య ఉందని ఎలాగైనా తీర్చాలని డిఎల్ఓ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కుమార్ కి తెలుపగా, సోమవారం ఆ గ్రామానికి సవర కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గేదలు పోలూరు గ్రామంలో వేసవికాలం ప్రారంభం కాకముందే గుక్కెడు మంచినీళ్లు కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రజలు కొత్త వాటర్ ట్యాంకు హంగామాకు ఏమి తక్కువ లేకుండా ఆర్భాటాలు చేసి తీరా చూస్తే అవి అలంకార ప్రాయా నికి తప్ప తాగడానికి మంచినీళ్లు రాలేదు. ప్రక్క గ్రామం నుండి పైపు ద్వారా వాటర్ వస్తుందని కానీ ఉదయం అరగంట సాయంత్రం అరగంట నీరు విడిచి పెడుతున్నారని అన్నారు. కొన్ని దపాలు నీరు కూడా రావడంలేదని దాన్ని వల్ల గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అని అన్నారు. ఊరిలో ఒక బావి ఉందని అది గ్రామానికి దూరంగా ఉందని ఆ బావిలో మారిన పదార్థాలు కూడా ఉన్నాయని ఆ నీరు త్రాగడం వల్ల మా ఆరోగ్యానికి కూడా గురవుతున్నామని గిరిజన మహిళలు కుమార్ కి తెలియజేశారు. ఇళ్లకు మంచినీటి సౌకర్యం ఉంటుందనే ఉద్దేశంతో మోటర్ బోర్ వేయించి. దాన్ని సోలార్ సిస్టం గానీ ట్యాంక్ గాని బిగించకపోవడంతో ఆ గ్రామ గిరిజన ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ దీనిపై ఎన్ని మార్లు ప్రజా ప్రతినిధులు గాని అధికారులు చెప్పినా కనీసం స్పందించలేదని గిరిజన గ్రామస్తులు వాపోయారు. ఎండాకాలం ప్రారంభం కాకముందే మంచినీటి కోసం చాలా ఇబ్బందిలు ఉంటే రానున్న రోజుల్లో ఇంకెంత ఇబ్బందులు ఉంటాయో అని ఆ ప్రాంత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గాని స్పందించి మంచినీటి కష్టాలు తీర్చాలని కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఎల్ఓ సభ్యులు సవర రాము, సవర ప్రసాద్, సవర చలపతి, సవర సుభాష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *