BHIM NEWS

Telugu News Channel

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైస్సార్సీపీ కోశాధికారి లోతుగెడ్డ

1 min read
Spread the love

భీమ్ న్యూస్ కొత్తూరు ప్రతినిధి (ఫిబ్రవరి 10) శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం సచివాలయం – 1 లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్సార్సీపీ నాయకులు వైస్సార్సీపీ జిల్లా కోశాధికారి పాతపట్నం వైస్సార్సీపీ నాయకులు లోతుగెడ్డ తులసి వరప్రసాద్ రావు డాక్టర్లు తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని వచ్చిన ప్రతి పెషేంట్ కి జాగ్రత్తగా చూడాలని అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వచ్చిన ప్రజలతో మాట్లాడుతూ ఇటువంటి ముఖ్యమంత్రి మునుపెన్నడు చూడలేదని దేశంలోనే పేదల ఆరోగ్యం కోసం ఇంటిఇంటికి డాక్టర్లను పంపించే ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న మాత్రమే అని, అటువంటి జగనన్నకి తోడుగా మనం ఎప్పుడు ఉండాలని లోతుగెడ్డ తులసి వరప్రసాద్ రావు అన్నారు. అలాగే పేదల కోసం ఆరోగ్య, గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్ లు, పీ.హెచ్.సి. లు, మెడికల్ కాలేజ్ లు ఇలా ఎన్నో రకాలుగా పేదల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి మన జగనన్నే అని ఆయన అన్నారు. పేషంట్లకు తులసి వర ప్రసాద్ రావు చేతులు మీదుగా మందులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వైద్య సిబ్బంది మరియు మాజీ సర్పంచ్ టంకాల రమణ రావు, వైస్సార్సీపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రేగెటి కన్నయ్య స్వామి, పల్ల రామకృష్ణ తదితర వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *