BHIM NEWS

Telugu News Channel

ఎన్నికల్లో గెలుపు కోసమే ఈ డీఎస్సీ: గిరిజన సంఘ నాయకులు

1 min read
Spread the love

భీమ్ న్యూస్ మెలియాపుట్టి ప్రతినిధి (ఫిబ్రవరి 10) రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు నియామకాల కొరకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటన జారీ చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో వైసిపి ప్రభుత్వం రాగానే తీస్తామని మెగా డీఎస్సీ ఉంటుందని హామీ ఇచ్చి ఎన్నికలు ముగియగానే, వైసిపి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర ఏళ్ళు కాలయాపన చేస్తూ ఇచ్చిన హామీని మర్చిపోయారు. మళ్లీ 2024 సాధారణ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఆగ మేఘాల మీద 6100 టీచర్ ఉద్యోగాలతో డీఎస్సీ ప్రకటన జారీ చేశారు. ఇది ఒక రకంగా డీఎస్సీ అభ్యర్థులకు ఒక మోసపూరితమైన ప్రకటనగానే డీఎస్సీ అభ్యర్థుల్లో కలుగుతుంది. ప్రస్తుత డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేస్తున్న కారణంగానే ఈ ప్రకటన తప్ప, డీఎస్సీ అభ్యర్థులపై చిత్తశుద్ధి లేదు. వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులపై చిత్తశుద్ధి ఉండుంటే సమయం లేని ఇలాంటి ప్రకటన చేయకపోయేవారు వాళ్ళు అడిగారు మేము ఇచ్చామనేటట్లు ఉంది తప్ప ఎడ్యుకేషన్ సిస్టంపై ఎలాంటి అవగాహన లేని ఎడ్యుకేషన్ మినిస్టర్ మరియు ఇతర మంత్రి వర్గం వల్ల రాష్ట్రంలో విద్యావ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఆలోచన తప్ప ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదు. గిరిజన నిరుద్యోగుల తో ప్రభుత్వం ఆడుతున్న ఆట అన్న కోణంతో – ఐటిడిఏ తరుపున ఐటిడిఏ సైతం గిరిజన పాఠశాలను గిరిజన విద్యార్థులు ను విస్మరించిందని తద్వారా మరింత వెనుకబాటుకు ఆదివాసీలు కి గురి అవుతున్నారని, ఇటువంటి నోటిఫికేషన్ లో ద్వారా ఆర్థికంగా వెనుకబడిన గిరిజన యువతి, యువకులు ఉద్యోగాలను మరిచి కూలీ పనులకు, ఇతరేతర చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించి ఎక్కువ సమయం ఇవ్వాలని ఈ డీఎస్సీ రద్దుచేసి మెగా డీఎస్సీ ఇవ్వాల్సిందిగాను పరీక్షలు కావలసిన సమయాన్ని కేటాయించవలసిందిగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం ఆదివాసి గిరిజన చైతన్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వరహాల కృష్ణారావు, లక్ష్మిపురం కిరణ్ కుమార్, లక్ష్మిపురం వెంకట్, లక్ష్మిపురం జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *