BHIM NEWS

Telugu News Channel

హైవే నిర్మాణం వారి నిర్వాహకంతో అష్టకష్టాలు – పంటనష్ట పరిహారం అందించాలని రైతులు డిమాండ్.

1 min read
Spread the love

భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్లకూరు (ఫిబ్రవరి 10) తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని పెన్నేపల్లి గ్రామం వద్ద స్వరముకి నది నుండి జువ్వలపాలెం, బిరద వాడ, ఉచ్చువారి పాలెం చెరువులకు వెళ్ళు నీటి కాలువను నేషనల్ హైవే వారు బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా కాలువను పూడ్చి వేయడం జరిగినది. గత మూడు నెలలుగా జువ్వలపాలెం, బిరదవాడ, ఉచ్చు వారి పాలెం, కానూరు, పెన్నేపల్లి, తాల్వాయిపాడు రైతులు వందల ఎకరాల పంటకు నీరు లేక నీరు పోయేకాలం పూడిక తీయమని రోడ్డు నిర్మాణ ఉద్యోగుల చుట్టూ పలువురు రైతులు ప్రదక్షిణ చేస్తున్నా బాధ్యతారహితంగా ప్రవర్తించి, వర్షాధార చెరువులైన పైన తెలిపిన గ్రామాల చెరువులకు నీటిపారుదల లేకుండా కారణమైన వీరిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడెక్కడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు, ఏజీఎం రమేష్, హరీష్, రామయ్య మరికొంతమంది ఒకరి మీద ఒకరు సంబంధం లేదంటూ చెప్పుకుంటూ రైతులను అష్ట కష్టాలు పెడుతున్నారు, ప్రభుత్వ భూములు, చెరువులు, కొండలు, గుట్టలు అక్రమంగా తవ్వడానికి , అక్కడున్న మట్టి గ్రావెల్ తరలించడానికి ఉన్న ఉత్సాహం, ఐకమత్యం వందల మంది రైతులు నష్టపోతుంటే కనీసం కనికరం కలగని ఈ నిర్లక్ష్య, దోపిడీ ఉద్యోగు లు పై తిరుగుబాటు తప్పదంటున్నారు రైతులు.

రైతులకు హైవే నిర్వాహకులు తక్షణం పంట నష్టపరహారం అందించాలి:

హైవే రోడ్డు నిర్మాణం చేపట్టింది మొదలు ఇప్పటివరకు రెండు సంవత్సరాల కాలంలో రోడ్డు వెంబడి గ్రామాల రైతులు తొట్టంబేడు మండలం పొయ్య, లింగమ నాయుడు పల్లి నుండి పెళ్లకూరు మండలం నెలుబల్లి, అక్క గారి పేట, టెంకాయ తోపు, కొత్తూరు, పెళ్లకూరు, వడ్డీ పాలెం, చిల్లకూరు, ఎగువ చావాలి, దిగువ చావాలి, తాల్వాయపాడు, నాయుడుపేట మండలం జువ్వలపాలెం, బిరదవాడ, ఉచ్చూవారి పాలెం వరకు గల గ్రామాల్లో రోడ్డు వెంబడి రైతులు పొలాలకు, కాలువలు లేక, నీరు లేక,భూములన్నీ బంజరు భూములుగా మారిపోయాయి. ఈ నిర్వాకం అంతా హైవే నిర్మాణం వలన జరిగిందని, రైతుల పరిస్థితి పంటలు వేయలేక పూర్తిగా రెండు పంటల కాలం తీవ్రంగా నష్టపోయామని, లబోదిబోమంటున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలిపితే రెవెన్యూ అధికారులు రోడ్డు అధికారులను అడగమని, వారి మీద వీరు, వీరి మీద వారు ఎవరూ పట్టించుకోకుండా ఉన్నారని రైతులు తెలిపారు. ఈ నష్టపరిహారం తగిన విధంగా తక్షణం హైవేరోడ్డు నిర్మాణం చేపట్టే గ్రామాల్లో రోడ్డు వెంబడి గల రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని , లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని మీడియా ముఖంగా తమ ఆవేదనను తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *