BHIM NEWS

Telugu News Channel

డయేరియా యువతి మృతి – ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : విపక్ష నేతలు

1 min read
Spread the love

 

భీమ్ న్యూస్ ప్రతినిధి గుంటూరు (ఫిబ్రవరి 11)      గుంటూరులో డయేరియా ప్రబలింది. దీంతో పద్మ అనే యువతి మృతి చెందారు. మరో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరికి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే వారంతా మూడు రోజులు నుంచి అస్వస్థతకు గురయ్యారని.. ఆస్పత్రికి వచ్చిన వెంటనే అడ్మిట్ చేసుకుని ట్రీట్ మెంట్ ఇస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం 30 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని అంటున్నారు. అయితే డయేరియా ప్రబలడం, యువతి మృతి చెందడంపై టీడీపీ, జనసేన నేతలు విమర్శలు చేస్తున్నారు. బాధితులను పరామర్శించడానికి ఆస్పత్రికి వెళ్లిన మేయర్, కమిషనర్‌ను అడ్డుకున్నారు. డయేరియాపై ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే యువతి మృతి చెందారని ఆరోపించారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికైనా డయేరియా ప్రబలిన ఏరియాలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *