BHIM NEWS

Telugu News Channel

ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి

1 min read
Spread the love

భీమ్ న్యూస్ ప్రతినిధి కావలి (ఫిబ్రవరి 11)                          శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముసునూరు టోల్‌ప్లాజా దగ్గర మూడు వాహనాలు ఢీ కొన్నాయి..ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ బస్సును లారీ ఢీకొట్టింది. మొదట ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ బస్సు లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు, అలాగే బస్సు డ్రైవర్‌ కూడా స్పాట్‌లోనే చనిపోయారు. ఈ ఘటనలో లారీ, బస్సు ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి.. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. 20 మందికి గాయాలయ్యాయి..పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు..గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది..కావేరి ట్రావెల్స్ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. ఘోర ప్రమాదం జరిగిన ఘటన తర్వాత కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాద పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారాయన. ప్రభుత్వం నుంచి బాధితులకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *