BHIM NEWS

Telugu News Channel

చిట్టమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమం .

1 min read
Spread the love

భీమ్ న్యూస్ ప్రతినిధి చిట్టమూరు( జనవరి 10)

జాతీయ నులిపురుగుల దినోత్సవ సందర్భంలో భాగంగా శుక్రవారం చిట్టమూరు మండల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల హెచ్ఎం మీనా కుమారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఒకటి నుండి 19 సంవత్సరాలు లోపు విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేసినట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు డాక్టర్ పద్మావతితెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం ఎప్పుడు సురక్షితంగా ఉండాలంటే, ముందుగా శానిటైజర్ తో చేతులను శుభ్రపరుచుకుని, ఆహారం తీసుకోవాలని తెలిపారు.పండ్లు ,కూరగాయలు కడిగి తినాలని ,బహిరంగ ప్రదేశంలో మలవిసర్జన చేయకూడదని, మరుగుదొడ్లనే వాడుకోవాలని పిల్లలందరికీ తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో,సాయి లహరి, సూపర్వైజర్స్, హైమావతి నాగేశ్వరరావు, ఏఎన్ఎం సక్కుబాయి, మెడికల్ ఆఫీసర్.సురేంద్ర, ప్రధానోపాధ్యాయురాలు మీన కుమారి, ఉపాధ్యాయులు , విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *