BHIM NEWS

Telugu News Channel

రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్నాం: పి వెంకటస్వామి, పట్టపు రవి

1 min read
Spread the love

 

 భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (ఫిబ్రవరి 11)            ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుడి శంఖారావం ప్రజా చైతన్య యాత్ర 45వ రోజు సూళ్ళూరుపేట పేట నియోజకవర్గంలోనీ నాయుడుపేట పట్టణంలో మరియు పెళ్లకూరు మండలంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం కొనసాగించారు. కరపత్రాలు పంచుతూ,రాబోయేటువంటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నాం అని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాలేటి వెంకటస్వామి మాట్లాడుతూ ఢిల్లీ మున్సిపాలిటీలో సుమారు 5000 మంది మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగాలలో చేర్పించిన ఘనత కేజ్రీవాల్ కే దక్కింది . ఏ రాష్ట్రంలో కూడా అంత మందిని ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలలో చేర్చిన చరిత్ర లేదు. కనుకఆంధ్రప్రదేశ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించుకోవాలని కోరారు అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గం ఇంచార్జ్ పట్టపు రవి మాట్లాడుతూ దేశం బాగుండాలంటే దానికి యువత ఆదర్శంగా ఉండాలని, ఆ యువత సమయాన్ని సక్రమమైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని కోరారు. మనం చదువుకున్న చదువులు కేవలం మార్కుల కోసమే కాకుండా, జీవితాన్ని అభివృద్ధి పథంలో ఎలా నడిపించుకోవాలన్న విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గం మహిళా కన్వీనర్ పులి మానస, సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ రాజు, రాజేష్ ,సుమన్ ,మానస, రాజమ్మ ,వెంకటేష్ ,సుధాకర్ మొదలగు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *