BHIM NEWS

Telugu News Channel

జిల్లాలో పీఎం శ్రీ ( PMSRI ) పాఠశాలలు ఇవే..

1 min read
Spread the love

భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి ( ఫిబ్రవరి 11)                కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానంలో భాగంగా అమల్లో చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ పథకం కింద చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలో పీఎంశ్రీ పీద్వారా 58 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు.

వీటి అవసరాల మేరకు ఒక్కో పాఠశాలకు రూ.40 లక్షలు వరకు ఖర్చు చేస్తారు. సృజనాత్మకంగా సాంకేతిక విధానాల ద్వారా వినూత్నంగా బోధన చేసేవిధంగా ఆకర్షణీయ తరగతి గదులు నిర్మిస్తారు. పంచాయతీరాజ్‌, పురపాలక పాఠశాలలు కేంద్ర ప్రభుత్వ, ఏపీ గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్యను గుర్తించి ఎంపిక చేశారు.
చిత్తూరు జిల్లాలో 15 తిరుపతి జిల్లాలో 43 పాఠశాలలు పీఎంశ్రీ ద్వారా గుర్తించి వచ్చే విద్యాసంవత్సరం నాటికి మౌలిక వసతుల కల్పనకు విద్యాశాఖ టెండర్లు పిలిచారు. తిరుపతి జిల్లాలో చంద్రగిరి, పాలమంగళం, బీఎన్‌ కండ్రిగ, వరగలి, చిన్నగొట్టిగళ్లు, మెటు, డక్కిలి, బీరకుప్పం, పిచ్చాటూరు, తొండమనాడు, తిరుచానూరు, వడమాలపేట, వరదయ్యపాళెం, పల్లం, యర్రావారిపాళెం, దామలచెరువు, రేణిగుంట, ఎల్‌ఏసాగరం, నాయుడుపేట బాలురు, బాలికలు, మేనకూరు, గొట్టిప్రోలు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, పుదూరు, కాపులూరు అన్నమేడు, గొట్టిప్రోలు, విన్నమాల మేనకూరు, తుమ్మూరు, అగ్రహారపేట ఎన్‌ఎస్‌ఆర్‌ కాలనీ, మామిళ్లపాడు ఆదర్శ పాఠశాల, చిట్టేడు, కేవీబీ పురం, సత్యవేడు,చిలమానుచేను, నాయుడుపేట, పుదూరు గురుకుల పాఠశాలలను ఎంపిక చేశారు.

నిధులతో ఏవిధమైన సౌకర్యాలు చేస్తారంటే :                                      కేంద్రం కేటాయించే నిధులతో డిజిటల్‌ తరగతి గదులు, గ్రంథాలయం, ప్రయోగశాలలు, రక్షిత శుద్ధిజల ప్లాంటు, సౌర విద్యుత్తు వసతి, క్రీడా ప్రాంగణం, పోషకాహార తోటలు, వ్యర్థాల సక్రమ నిర్వహణ, ప్లాస్టిక్‌ రహిత, నీటి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పాఠశాలలు బోధన పద్ధతులు ప్రయోగాత్మకంగా సంపూర్ణంగా, బొమ్మలు వనరులు ఆధారంగా ఉంటాయి.

ఇదీ భవిష్యత్తు ప్రణాళికగా :

మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా భవిష్యత్‌లో పరిశ్రమలతో అనుసంధానం చేసి పాఠాలు బోధిస్తారు. నైతిక, పౌరసత్వ విలువలు, దేశ నిర్మాణం, ప్రాథమిక విలువలు బాధ్యతలు పట్ల విద్యార్ధులకు చదువు నుంచి అలవాటు చేసే దిశగా తరగతుల్లో పాఠ్యాంశాల బోధన కొనసాగుతుంది. ఇప్పటికే ఈపాఠశాలల నుంచి కొందరు ఉపాధ్యాయులను ఎంపిక చేసి తిరుపతి ఐఐటీ చెందిన నిపుణులు ద్వారా శిక్షణ ఇచ్చారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *