BHIM NEWS

Telugu News Channel

ఏపీ ఉద్యోగులతో ప్రభుత్వం పండు – కాయ ఆట! చర్చల పేరుతో ఆడుకుంటున్న వైనం

1 min read
Spread the love

భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి ( ఫిబ్రవరి 12) ఏపిలో ఉద్యోగ సంఘాలతో చర్చలు విఫలమయ్యాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ వారిని నిరుత్సాహపర్చింది. మధ్యంతర భృతి విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో యథావిధిగా ఉద్యమ కార్యచరణను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నెల 14 నుంచి ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళనను ఉధృతం చేయనున్నారు. అదే రోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయనున్నారు. ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నామని ఏపీఎన్జీవో కార్యవర్గం సభ్యుడు బండి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మార్చి చివరికి కొన్ని బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. రూ. 600 కోట్లు ఏపీజీఎల్ఐ బకాయిలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సీపీఎస్ రూ. 2500 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. సరెండర్ లీవ్ బకాయిలు రూ. 26 వేల కోట్లు ఉన్నాయన్నారు. పోలీసులకు రూ. 300 కోట్ల బకాయిలు మార్చి 31కి చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినట్లు తెలిపారు. ఉద్యోగులకు డీఏ బకాయిలు రూ. 7500 కోట్లు ఉన్నాయని బొప్పరాజు పేర్కొన్నారు. ఉద్యోగులకు మొత్తం రూ. 20 వేల కోట్ల బకాయిలున్నాయని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టు కార్మికుల రెగ్యూలరైజేషన్‌కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పోస్టులు, మ్యాపింగ్ కాలేదని క్రమబద్దీకరణ చేయట్లేదని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనం పెంచాలని కోరామన్నారు. మెడికల్ రీయింబర్స్ మెంట్ చేయాలని కౌన్సిల్ సమావేశంలో కోరినట్లు బొప్ప రాజ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *