BHIM NEWS

Telugu News Channel

నా సమస్యను పరిష్కరించండి తహశీల్దారు సారూ..!

1 min read
Spread the love

భీమ్ న్యూస్ ఇందుకూరుపేట ప్రతినిధి (ఫిబ్రవరి 12) ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలు కొందరు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఎస్సీ. గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నారు. ఐదేళ్లు కాలయాపన చేసి, ఇప్పుడు హడావుడిగా రోడ్లు నిర్మాణం చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్ధమైన ప్రజలు నేతలను విమర్శిస్తున్నారు. సీసీ రోడ్లు వేసే క్రమంలో అధికార, విపక్ష పార్టీల నేతలు, తమ బలాబలాలు చూపించుకోవాలని సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి సంఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొమరిక పంచాయతీ, ఎస్సీ. కాలనీలో చోటు చేసుకుంది. ఎస్సీ. కాలనీ వాస్తవ్యుడు ఈదూరు జ్ఞాన ప్రసాద్ అనే వ్యక్తి ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. గత నాలుగు రోజుల క్రితం అధికార పార్టీ సర్పంచ్ ప్రతినిధి తమ కాలనీలో 9 అడుగులు వెడల్పు ఉన్న దారిలో 6 అడుగులు సీసీ రోడ్లు వేస్తూ, వీధి మూల తిరుగుడులు వద్దనైనా సీసీ రోడ్లు వెడల్పుగా వేయలేదు. ఇదేమని అడిగితే వీధి ప్రక్కల నివాసం ఉన్న కాలనీ వాసులు అడ్డు తగలడం వల్ల 6 అడుగులు వెడల్పుతోనే సీసీ రోడ్లు వేశామని చెప్పారు. వీధి ప్రక్కల నివాసం ఉన్న కాలనీ వాసులను అడిగితే, తన పైకి గొడవలకు వస్తున్నారని, ప్రస్తుతం వేసిన సీసీ రోడ్లు మీద తన ఆటో కాలనీలోకి రావాలన్నా, బయటకు పోవాలన్నా వీధి మూల తిరుగుడులు వద్ద ఇబ్బంది పడుతున్నానని జ్ఞాన ప్రసాద్ నేడు స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద నున్న మీటింగు హాలు నందు జరిగిన జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో తహశీల్దారుకి, తన సమస్యను వివరించి, సమస్య పరిష్కరించాలని కోరుతూ అర్జీ సమర్పించాడు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ కాలనీలో ఇలాంటి గొడవలు మరి కొందరికి కూడా జరిగాయన్న వాస్తవాలను వివరిస్తూ కన్నీరు మున్నీరయ్యారు.  కొత్తగా మండలానికి వచ్చిన తహశీల్దారు, జ్ఞాన ప్రసాద్ ఇచ్చిన అర్జీపై స్పందించి సమస్యను పరిష్కరిస్తారో..లేదో.. వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *