BHIM NEWS

Telugu News Channel

సిరుసువాడ రోడ్ పనులు ప్రారంభం చేసిన వైఎస్సార్సీపీ జిల్లా కోశాధికారి లోతుగెడ్డ

1 min read
Spread the love

భీమ్ న్యూస్ కొత్తూరు ప్రతినిధి (ఫిబ్రవరి 12) శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల పరిషత్ నిధులతో సిరుసువాడ నుండి కొత్త కొత్తూరు వరకు రిపేర్ వర్క్స్ చేయడం జరిగింది. అలాగే ఆదివారం కొత్త కొత్తూరు, కొత్తూరు నుండి నివగాం మెయిన్ రోడ్ వరకు సీసి రోడ్ వేయడం జరుగుతోంది. ఈ రోడ్ ను లోతుగెడ్డ తులసి వర ప్రసాద్ రావు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పనులు మొదలుపెట్టారు. ఈ పనులు మండల వైస్ ఎంపీపీ, శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కోశాధికారి లోతుగెడ్డ తులసీ వర ప్రసాద్ రావు కొంత సమయం అక్కడే పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా ఎవరూ పట్టించుకోని ఈ రోడ్ నీ స్థానిక నాయకుడు లోతుగెడ్డ తులసీ వర ప్రసాద్ రావు దృష్టికి తీసుకువెళ్లిగా వెంటనే స్పందించి మండల గ్రాంట్ కేటాయించి పనులు ప్రారంభం చేసినందుకు కొత్త కొత్తూరు మరియు సిరిసువాడ, గ్రామస్థుల సంతోషం వ్యక్తం చేసి లోతుగెడ్డ తులసీ వర ప్రసాద్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లోతుగెడ్డ తాత బాబు, పడాల వెంకట కృష్ణ, లోతుగెడ్డ సాగర్, లోతుగెడ్డ కృష్ణ, వడమ శ్రీనివాసరావు ఇసై ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *