BHIM NEWS

Telugu News Channel

పలు కార్యక్రమాలకు కృపారాణి దంపతులు

1 min read
Spread the love

 

భీమ్ న్యూస్ టెక్కలి ప్రతినిధి (ఫిబ్రవరి 12) శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలం టెక్కలి అయ్యప్ప నగర్ లోని మెట్ట తేజరావు కుమార్తె చరిష్మా ఓణీ ఫంక్షన్ లో కృపారాణి దంపతులు పాల్గొని షర్మిలను ఆశీర్వదించారు. అనంతరం కొత్తపేట మాజీ సర్పంచ్, ప్రస్థుత సర్పంచ్ ప్రతినిధి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత రామపాత్రుని ముకుంద రెడ్డి మరణం పట్ల వారి చిత్ర పటానికి నివాళుర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను కేంద్ర మాజీ మంత్రి డా. కిల్లి కృపారాణి పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామకృష్ణ, మైనారిటీ సెల్ రాజుబాయి, లింగ మూర్తి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *