BHIM NEWS

Telugu News Channel

కార్యకర్తల్లో జోష్ నింపిన నారా లోకేష్

1 min read
Spread the love

భీమ్ న్యూస్ టెక్కలి ప్రతినిధి (ఫిబ్రవరి 12) నారా లోకేష్ రాకతో శ్రీకాకుళం జిల్లాలో తెలుగు తమ్ముళ్లల్లో జోష్ నింపారు. ఆదివారం జరిగిన ఇచ్చాపురం సభలోనూ, పలాస సభలోనూ అనంతరం టెక్కలలో భారీ బహిరంగ సభలలో ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా వాసులకు, తెలుగు తమ్ముళ్లకు, ప్రజలకు, ప్రతి కార్యకర్తకు తన మాటలతో జోష్ నింపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడుతూ, శంఖారావం కార్యక్రమంలో జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా కోరుతూ, తమకే ఓటు వేయాలని కోరారు. అలాగే భవిష్యత్తు గ్యారెంటీ అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెనాయుడు, కోన రవికుమార్, ఎమ్మెల్సీ చిరంజీవిలు, శిరీష, మావిడి గోవిందు రావు, దాసి నాయుడు, జనసేన పార్టీ నాయకులు కిణిత్ కిరణ్, జన సైనికులు, టీడీపీ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *