BHIM NEWS

Telugu News Channel

గణపర్తి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా బాబు షూరిటి – భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం.

1 min read
Spread the love

భీమ్ న్యూస్ ప్రతినిధి చిట్టమూరు (జనవరి 12) తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం లో గత కొన్ని రోజుల గా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం చిట్టమూరు మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో చిట్టమూరు మండల పరిధిలో ఉన్న అన్ని పంచాయితీ లో నిర్విరామంగా  క్రమ క్రమంగా కొనసాగుతోంది. ప్రతి గ్రామం లో ప్రతి వీధిలో  ఇల్లు ఇల్లు పరిశీలిస్తూ ,ప్రజల కష్టాలని కన్నీటి చుక్కల్ని గమనిస్తూ, తెలుసుకుంటూ ప్రజల మధ్యనే తిరుగుతూ , తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రతి ఒక్కరికి వివరిస్తూ కరపత్రాలను పంచడం జరుగుతూవుంది.ప్రజలందరికీ భరోసాను కల్పిస్తూ సోమవారం రోజు ఆరూరు పంచాయతీ పరిధిలో కొనసాగింది.ఈ కార్యక్రమం సందర్భంగా కిషోర్ నాయుడు మాట్లాడుతూ ఇప్పుడున్న అరాచకాపాలన కొనసాగుతుందని ప్రజలే ఓటుతో ఈ వైసీపి ప్రభుత్వానికి బుద్దిచెబుతారని అన్నారు.ఈ రోజు ప్రజలు క్షేమం కోరి, ప్రజల రక్షణ కొరకే మేము ప్రతి గ్రామంలో తిరుగుతున్నామని ఈ గ్రామంలో ఉన్న ప్రజల కష్టాలను చూస్తుంటే, ప్రజలందరినీ బందీకానాల్లో బంధించినట్టు ఉందని, ఇలాంటి పాలన ఇప్పటివరకు చూడలేదని, ప్రజల స్పందన చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో ఈ వైసీపి పాలనని గద్దె దించి,తిరుగులేని విజయంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని గెలిపించే ఆలోచనలో ప్రజలున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలందరికీ సూపర్ సిక్స్ తో పాటు ఎన్నో పథకాలు అమలుచేసి ప్రజలకి అండగా నిలిచి, బందీకానాలో ఉన్న ప్రజలందరినీ విడిపించి, స్వేచ్ఛ గా బ్రతికే అవకాశాన్ని కల్పిస్తామని , పాశిం సునీల్ కుమార్ నీ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించడం మన అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. అనంతరం ఆరూరు టిడిపి పంచాయతీ అధ్యక్షుడు ముత్తురాజ్ ఆధ్వర్యంలో 150 మంది నాయుకులకి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆరూరు గ్రామ సర్పంచ్ చెంగమ్మ ,ఏడుకొండలు,ఉదయ్,దేవుడు,గిల్లయ, శ్యామ్,ఆధ్వర్యంలో టిడిపి పార్టీ మండల అధ్యక్షుడు కిషోర్ నాయుడుకు, పార్టీ నాయకులందరికీ ఘన స్వాగతం పలికి కూల్ డ్రింక్స్ ,స్నాక్స్ అందించారు. కిషోర్ నాయుడు, మారంరెడ్డి జనార్దన్ రెడ్డి, గిరినాయుడు, శివారెడ్డి లను , శాలువాలు కప్పి పూలమాలలతో సన్మాన సత్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గుంపర్ల చిన్నారావు, టీడీపీ చిట్టమూరు మండల నాయకులు, కార్యకర్తలు, భారీగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *