BHIM NEWS

Telugu News Channel

నాయుడుపేట లో 46వ రోజు AAp విస్తృత ప్రచారం

1 min read
Spread the love

 

భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట ( ఫిబ్రవరి 12) ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుడి శంఖారావం ప్రజా చైతన్య యాత్ర 46వ రోజు సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట పట్టణంలో కరపత్రాలను పంచుతూ, సభ్యత్వాన్ని నమోదు చేస్తూ చీపురు గుర్తుకు ఓటేయాలని ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాలేటి వెంకటస్వామి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. అదే విధంగా సులూరుపేట నియోజకవర్గ ఇన్చార్జి పట్టపు రవి మాట్లాడుతూ సమాజంలో దోచుకునే వాళ్లు దోపిడీకి గురికాబడిన వాళ్లు ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం ముందుకు నడవదని తెలియజేశారు. ప్రజాస్వామ్యం బాగుండాలంటే మంచి వ్యక్తులను ప్రజలు ఎన్నుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా సూళ్ళూరుపేట నియోజకవర్గ మహిళా కన్వీనర్ పులి మానస పెళ్లకూరు మండలంలో కరపత్రాలను పంచుతూ సభ్యత్వాన్ని నమోదు చేస్తూ చీపురు గుర్తుకు ఓటు వేయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందిమండలం మోహన్ రాజు, రాజేష్, సంధ్య, శ్రావణి, రమణమ్మ, శివానందం మొదలగు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *