BHIM NEWS

Telugu News Channel

తిరుపతిలో మరో నలుగురు పోలీసు అధికారులు సస్పెండ్.

1 min read
Spread the love

భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (ఫిబ్రవరి 12) తిరుపతి  లోక్ సభ ఉప ఎన్నికల సమయంలో తిరుపతిలో దొంగ ఓట్లు కలకలం విషయం తెలిసిందే. ఎవరూ లేని ఇంటిలో పదుల సంఖ్యలో ఓట్లు నమోదు అయ్యాయి. చనిపోయిన వాళ్లకు సైతం ఓటు హక్కు కల్పించారు. అంతేకాదు డిగ్రీ అర్హత లేకున్నా పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు నమోదు చేశారు. దీంతో ప్రతిపక్ష నేతలు తిరుపతి పోలీసులు, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు నమోదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దొంగ ఓట్లకు సంబంధించి పలు ఆధారాలు సమర్పించారు. అయితే ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. కేసు విచారణ చేపట్టకుండా జాప్యం చేశారు. దీంతో ఉన్నతాధికారులు, ఎన్నికల సంఘం సీరియస్ అయింది. అప్పటి తిరుపతి ఈస్ట్ సీఐ శివసాద్ రెడ్డి, వెస్ట్ సీఐ శివ ప్రసాద్, ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారాకానాధ్ రెడ్డి సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే అలిపిరి సీఐ అబ్బన్నను వీఆర్‌కు బదిలీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *