BHIM NEWS

Telugu News Channel

శ్రీకాళహస్తి ఆలయానికి విదేశీ భక్తుల తాకిడి ఎక్కువ సుమీ!

1 min read
Spread the love

భీమ్ న్యూస్ ప్రతినిధి శ్రీకాళహస్తి( ఫిబ్రవరి 12)        ఏపీ రాష్ట్రంలో ఉన్న శ్రీకాళహస్తీశ్వరా ఆలయానికి ఇటీవల కాలంలో విదేశీ భక్తుల తాకిడి పెరుగుతూవుంది. రాహు కేతు పూజల గురించి మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రచారం జరుగుతుంది. దీంతో విదేశీ భక్తులు ఆలయానికి రావడం, స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం, రాహు కేతు పూజలను చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఇటలీకి చెందిన 15 మంది భక్తులు ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా దేవస్థానం సిబ్బంది వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయించారు. ఆలయంలోని శిల్ప సంపదను చూసి ఇటలీ భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆలయ ఆవరణను కూడా పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *