BHIM NEWS

Telugu News Channel

5సం.ల ఎన్ని కలల ఏపీ “డీ-ఎస్-సీ”

1 min read
Spread the love

భీమ్ న్యూస్ ప్రతినిధి విజయవాడ ( ఫిబ్రవరి 12) ఏపీ లో 5 సంవత్సరాల ఎన్నో కలల తర్వాత నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. నేటి నుంచి డీఎస్సీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఇప్పటికే ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6,100 టీచర్ల పోస్టుల భర్తీకి మంత్రి బొత్స నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఎస్జీటీ-2,280, స్కూల్ అసిస్టెంట్స్-2,299, టీజీటీ-1,264, పీజీటీ-215, ప్రిన్సిపాల్-42 పోస్టులకు డీఎస్సీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 12 నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. ఈ నెల 22 వరకు అన్‌లైన్‌లో దరఖాస్తులు, మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్, మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు, మార్చి 31 ప్రాథమిక కీ విడుదల చేస్తామన్నారు. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటించనున్నారని ప్రభుత్వం తెలిపింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *