BHIM NEWS

Telugu News Channel

ఏపీకి మళ్ళీ ప్రత్యేక హోదా, ఆపై రాజధాని “అమరావతి టు విశాఖ టు హైదరాబాద్”!.. వైసీపీ మంత్ర యంత్రాంగం.

1 min read
Spread the love

భీమ్ న్యూస్ ప్రతినిధి విశాఖపట్నం (ఫిబ్రవరి 12) రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి రావడంతో పదేళ్లుగా ప్రత్యేక హోదా డిమాండ్ నలుగుతూనే ఉంది. 2019కు ప్రత్యేక హోదాపై నిరసన తెలిపిన వైసీపీ.. ఆ తర్వాత మర్చిపోయింది. తాజాగా మళ్లీ ప్రత్యేక హోదాపై దృష్టిపెడుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేక హోదాపై వైసీపీ సీనియన్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రత్యేక హోదాపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. విభజన హామీల అమలుపై రాజ్యసభలో ఒత్తిడి తెస్తామని చెప్పారు. పరిపాలన రాజధాని విశాఖలో ఏర్పాటు అయ్యే వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంశంపై కేంద్రంతో చర్చిస్తామని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని వైవీ పేర్కొన్నారు. 22 మంది ఎంపీలున్నా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బలంగా ఉన్నంత వరకూ ప్రత్యేక హోదా తీసుకురావడం కష్టతరమైన పని అని చెప్పారు. 2019కు ముందు ఏడుగురు వైసీపీ ఎంపీలతో పార్లమెంట్‌లో పోరాటం చేశామని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం పోరాటం చేయడం కన్నా సామరస్యంగా పరిష్కరించుకోవడం బెటర్ అని చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కేంద్రంలో ఉన్న పార్టీ సహకారం కావాలని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *