BHIM NEWS

Telugu News Channel

500 పేద కుటుంబాలకి భూ పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం

1 min read
Spread the love

భీమ్ న్యూస్ తోటపల్లి గూడూరు ప్రతినిధి (ఫిబ్రవరి 13) ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (సిపిఎం పార్టీ అనుబంధ సంస్థ) తోటపల్లి గూడూరు మండలం శాఖ ఆధ్వర్యంలో పేడూరు, కృష్ణారెడ్డిపాలెం, పాపిరెడ్డిపాలెం, తోటపల్లి గూడూరు ఇసుకపాలెంకు చెందిన 500 పేద కుటుంబాలకు సోమవారం భూ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యవర్గ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, నెల్లూర్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యవర్గ సభ్యులు పచ్చా మధు, రమణమ్మ, సి.పి.ఎం. మండల కార్యదర్శి వేగూరు వెంకయ్య, బండి శౌరి, లక్ష్మయ్య, మంగలి పుల్లయ్య, ఆలు తిరుపాలు, జిల్లా కె.వి.పి.ఎస్. జొన్నలగడ్డ వెంకమ్మ, రాజు తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *