BHIM NEWS

Telugu News Channel

మీది రెడ్ పుస్తకం అయితే మాది గ్రీన్ పుస్తకం: దువ్వాడ శ్రీనివాస్

1 min read
Spread the love

భీమ్ న్యూస్ టెక్కలి ప్రతినిధి (ఫిబ్రవరి 13) శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆదివారం జరిగిన శంఖారావంలో లోకేష్ చెప్పినవన్నీ వినే పొజిషన్లో రాష్ట్ర ప్రజలు లేరని, బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ అంశాలపై లేవనెత్తిన లోకేష్ కి ఎటువంటి అనుభవం లేదని, ఈ భవిష్యత్తు గ్యారెంటీ సంక్షేమ పథకాలు కూడా వైసిపి ప్రవేశపెట్టిన పథకాలకు కాపీ కొట్టినవే అని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. భవిష్యత్తు గ్యారంటీ షూరిటీ నిదానంతో ముందుకు వెళితే రాష్ట్ర ప్రజలకు నేరుగా తమ ఖాతాల్లోకి బటన్ నొక్కి సంక్షేమ నిధులు విడుదల చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి దేనని ఆయన వివరించారు. ఆయనతో పాటు అచ్చన్న కు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకుండా భారీ మెజార్టీతో గెలుస్తామని మా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలే మమల్ని గెలిపిస్తాయని వివరించారు. మా ప్రభుత్వంపై రెడ్ పుస్తకం విడుదల చేస్తే మేము దానిని గ్రీన్ పుస్తకంగా అమలు చేస్తామని ప్రతి ఒక్క పేదవాడు గుండెల్లో నిలిచిపోయే ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డిని 2024లో మళ్లీ ఆయనే సీఎం అవుతారని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా మరింత ముందుకు తీసుకు వెళుతూ, పల్లెనిద్ర గడప గడపకు, బస్సు యాత్ర మొదలైన కార్యక్రమాలతో ప్రజా హృదయాల్లోకి దూసుకుపోతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీనికి అందరం కలిసి నడుం బిగించాలి. అలాగే లోకేష్ గా అడుగుతున్న శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం టు ఇచ్చాపురం ఎక్కడైనా సరే ఏ మంచి కార్యక్రమమైనా చేశారా మీ అభివృద్ధి ఏంటో చూపించండి. ముక్కు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆకుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, అందరూ కలిసి నన్ను వాడుకోని వదిలేశారని, తన కన్నీళ్ళతో బాధని విలేకరి సమావేశంలో దుఃఖాన్ని వ్యక్తపరిచారు. ఇకనుంచి వైసిపి ప్రభుత్వంతో కలిసి అన్ని కార్యక్రమాలకు హాజరవుతానని, జగనన్న ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశాభావం వ్యక్తపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *