మళ్లీ మేమే గెలుస్తాం: గురునాధ్ యాదవ్
1 min readభీమ్ న్యూస్ టెక్కలి ప్రతినిధి (మార్చి 13) 2024 లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ వైఎస్ఆర్సిపి పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుచుకొని విజయకేతనం ఎగరేస్తుందని టెక్కలి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులు, రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షులు గద్దెబోయిన గురునాధ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ 2024లో మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని టెక్కలి నుంచి తిరుపతి వరకూ 1030 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగిందని గురునాధ యాదవ్ గుర్తు చేశారు. పాత శ్రీకాకుళం జిల్లా ప్రకారం ఉన్న 38 మండలాల్లో ఉన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలను, యాదవ పెద్దలను ప్రతిరోజు ఫోన్ లో పలకరిస్తూ, జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీ గెలుపు కోసం, జిల్లా ఎంపీ మరియు అందరు ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. టెక్కలి నుంచి తిరుపతి వరకు 1030 కిలోమీటర్లు పాదయాత్ర చేయడమే కాకుండా జిల్లాలో కూడా అన్ని ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా గెలుచుకునే విధంగా జిల్లా వ్యాప్తంగా పర్యటించి పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే నవరత్నాలు గురించి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా పురోధికంగా లాభదాయకంగా ఉపయోగపడ్డాయని, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఉపయోగపడ్డాయి. మళ్లీ సీఎం జగన్ సీఎం చేసే సమయం వచ్చిందని ప్రతి ఒక్కరు తమ ఓటు ఫ్యాన్ గుర్తుకే వేయాలని కోరారు. వైసిపి పార్టీ కోసం నేను రాత్రి పగలనకా శ్రమిస్తూ ఉంటానని గురునాథ్ యాదవ్ మీడియా ముఖంగా తెలియజేశారు.