సీఎం జగన్ కి రుణపడి ఉంటాం: తలసముద్రం సూర్యం
1 min readభీమ్ న్యూస్ టెక్కలి ప్రతినిధి (మార్చి 14) శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలంలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ శంకుస్థాపన చేసిన రోజు నుండి నేటి వరకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కొంతమేరకు కలిగాయని, గతంలో కొన్ని ప్రభుత్వాలు శంకుస్థాపన చేసిన కూడా పట్టించుకోలేదు కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిక్కోలకి ఊపిరి పోశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి శ్రీకాకుళం జిల్లా వాసుల అందరం కూడా రుణపడి ఉంటామని, అందరం కలిసి మళ్లీ జగన్ నే గెలిపించుకుంటామని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి అధ్యక్షులు తలసముద్రం సూర్యం అన్నారు. సూర్యం మాట్లాడుతూ, ఈ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ వలన ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలో శ్రీకాకుళం ఒకటి ఈ పోర్టు వల్ల మంచి గుర్తింపుతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గం అనేది రాష్ట్రంలో ఒక స్మార్ట్ టౌన్ గా ఏర్పడుతుంది. ఎందరో ముఖ్యమంత్రి మారిన పట్టించుకోని పోస్టు గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి దయవల్ల పోస్ట్ శంకుస్థాపన జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్ని పనులు కూడా చాలా త్వరగా జరుగుతున్నాయని కొంతమంది నిరుద్యోగులకు సెక్యూరిటీ గార్డ్, ఆఫీస్ బాయ్ గా, సివిల్ ఇంజనీరింగ్, ప్లానింగ్, పలు ఉద్యోగంలో ఉపాధి లభించింది. పోర్టు పూర్తయితే జిల్లాలో నిరుద్యోగత కొంతమేరకు తగ్గుతుందని నేను భావిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా వాసుల అందరం కూడా జగన్ మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని మీడియా ముఖంగా మాట్లాడారు.