April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

బస్సును వెనుక నుండి ఢీకొన్న కారు – ఇద్దరు మృతి

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి  చిల్లకూరు (మార్చి 14) తిరుపతి జిల్లా బూదనం వద్ద  బస్సును వెనుక నుండి కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా సమీపంలో ఆగి ఉన్న బస్సును కారు ఢీ కొట్టింది. ఈ సంఘటన లో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గిద్దలూరు నుండి చెన్నైకి వెళుతున్న బస్సును కారు ఢీ కొట్టింది. బస్సు టైర్ పంచర్ కావడంతో జాకీ కోసం బస్సు వెనుకకు డ్రైవర్ వెళ్లాడు. అయితే, అతివేగంతో వచ్చిన కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు బస్సు డ్రైవర్. ఇక కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తాడేపల్లి గూడెం నుంచి చెన్నైకి కారు వెళుతోంది. అటు క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *