April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

రాబోయే ఎన్నికల్లో నా భర్తను ఆశీర్వదించండి : పాశం సంధ్యారాణి విస్తృత ప్రచారం.

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి గూడూరు (మార్చి 14)  తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆరో వార్డులో బుధవారం, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. స్థానికుడైన నా భర్తకు అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీకు అండగా ఉంటామని తెలిపారు. నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి  కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *