April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

ఏపీపీఎస్సీ లో 150 కోట్ల భారీ కుంభకోణం చేసింది వనమాడి మోహన వర్మే

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి కాకినాడ (మార్చి 15)  ఏపీ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్  రెడ్డి APPSC ఉద్యోగాలు అమ్ముకొని 150 కోట్ల భారీ కుంభకోణం చేసి నిరుద్యోగ యువతను మోసం చేశాడని ప్రొఫెషనల్ వింగ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు వనమాడి మోహన వర్మ పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ వింగ్, తెలుగు యువత, తెలుగు నాడు స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా మోహన్ వర్మ, చింతలపూడి రవి, నీలకాయలు సన్నీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల నియామకంలో జగన్ రెడ్డి ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరతీసింది.

ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ రూ.2.5 కోట్లకు, ఒక్కో డీఎస్పీ పోస్ట్ రూ.1.5 కోట్లు రూపాయలు అమ్ముకొని నిరుద్యోగ యువతను మోసం చేశాడని, గ్రూప్ 1 మెయిన్స్ లో ప్రభుత్వ అక్రమాలు హైకోర్టులో బహిర్గతం అయింది.గ్రూప్1 మెయిన్స్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆ నోటిఫికేషన్ ద్వారా నియామకమై ప్రస్తుతం వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న 162 మంది నియామకాలు చెల్లవని, మళ్లీ మెయిన్స్ పరీక్ష నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు తీర్పునివ్వడం కూడా జరిగిందని తెలిపారు.సాంప్రదాయంగా అనుసరిస్తున్న మాన్యువల్ మూల్యాంకనం కాకుండా తమ వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు జగన్ రెడ్డి ప్లాన్ చేసి మరి డిజిటల్ వాల్యూషన్ చేశాడని,తెలంగాణలో ఇదే విధంగా జరిగినపుడు బాధ్యులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని శిక్షించడం జరిగిందని, జగన్ రెడ్డికి ఏ మాత్రం నైతిక విలువలు విశ్వసనీయత ఉన్నా కుంభకోణానికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *