April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

భారతీయ మహాసేన ఆధ్వర్యంలో పెండింగ్ కేసు రాజీ

1 min read

భీమ్ న్యూస్ చేజర్ల ప్రతినిధి (మార్చి 15) భారతీయ మహాసేన (బి.ఎం.ఎస్.) వ్యవస్థాపక అధ్యక్షుడు జువ్విగుంట బాబు ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా పెండింగ్ లో వున్న కేసు నేడు లోక్ అదాలత్ కోర్టులో రాజీ పెట్టించడం జరిగిందని బి.ఎం.ఎస్. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కర్నాటి వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెళ్ళేరు గ్రామం నివాసి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వేలూరు ఆదిలక్ష్మి అనే మహిళ అదే పంచాయతీ పరిధిలో వున్న తన పొలాల్లోని పంట నష్టం చేశారని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కర్నాటి వెంకయ్య, రవి, పెంచలయ్య, వెంకటేశ్వర్లు, కిరణ్ తో పాటు ఒక మహిళ పైన 2020 లో రాజకీయ నాయకుల ఒత్తిడుల ద్వారా స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి కోర్టుకి పెట్టించారు. అప్పటి నుంచి కోర్టు చుట్టూ వాయిదాలకు తిరిగి అలసిపోయిన బాధితులు జువ్విగుంట బాబును ఆశ్రయించారు. బాధితులు చెప్పిన వివరాలను పరిశీలించిన పిదప ఇది అక్రమ కేసు అని నిర్ధారణకు వచ్చి, ఆ పొలం ప్రభుత్వ భూమి అని, ఆ భూమిలో కట్టిన రేకుల ఇల్లు కూడా పొలాన్ని ఆక్రమించిన తరువాత అక్రమంగా కట్టారని ఋజువు చేశారు. ఆ మూడు ఎకరాల భూమి కర్నాటి వెంకయ్య అనుభవంలో వుండగా ఇలా అక్రమ కేసు నమోదు చేయించడం అన్యాయమని, కేసును రాజీ చేసుకోవాలని ఆదిలక్ష్మి కుటుంబ పెద్దలతో మాట్లాడి ఒప్పించి, నేడు ఆత్మకూరు డివిజన్ బెంచ్ కోర్టు లోక్ అదాలత్ లో కేసు రాజీ పెట్టించి, ఆ పొలంతో పాటు రేకుల ఇల్లును కూడా కర్నాటి వెంకయ్య కుటుంబ సభ్యులకు స్వాధీనపరచడం జరిగిందని, ఈ కేసులో ఇరుపక్షాల పెద్దలతో మాట్లాడిన బాబు శాంతికి పెద్ద పీట వేశారని వెంకటేశ్వర్లు మీడియాకి వెల్లడించారు. అక్రమ కేసులో కోర్టు వాయిదాలకు తిరిగి తిరిగి విసుగు చెందిన బాధితులు నేడు కేసు రాజీ పడడంతో ఉపశమనం పొంది, కేసు రాజీకి విశేష కృషి చేసిన బి.ఎం.ఎస్. బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *