April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

వైసీపీ కి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి రాజీనామా

1 min read

భీమ్ న్యూస్ కావలి ప్రతినిధి (మార్చి 15) కావలి మాజీ శాసనసభ్యులు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి వైసీపీ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహా కమిటీ సభ్యులు పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలు వైఎస్సార్సీపీ లో 2019 ఎన్నికలలో కావలి, ఉదయగిరి వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్ధుల గెలుపుకు ఎంతో కష్టపడి పని చేసానని, కార్యకర్త కన్నా హీనంగా చూసేవారనీ అవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానం చంపుకుని వైసిపి పార్టీలో ఉండలేకే రాజీనామా చేశానని తెలిపారు. అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయనీ ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఆయనతో పాటు ఒంటేరు జయ చంద్రారెడ్డి, మెట్టుకూరి రాంజీవిరెడ్డి, కార్యకర్తలున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *