బడి రుణం తీర్చుకున్న డీజీ పురం విద్యార్థినులు
1 min readభీమ్ న్యూస్ సంత బొమ్మాలి ప్రతినిధి (మార్చి 15) శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దండుగోపాలపురం విద్యార్థినిలు కె. సాధన ప్రియ, కె. కావ్యశ్రీ, కె. చాందినీ గత సంవత్సరము 2022-23లో 10వ తరగతి పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరచి 560కి పైగా మార్కులు సాధించి ఐ.ఐ.ఐ.టి (IIIT) నూజివీడు, శ్రీకాకుళములలో ప్రవేశం పొందారు. వారికి ప్రభుత్వము వారు 3000, 2000,1000 రూపాయలు నగదు పురస్కారం అందచేశారు. వారు ఆ మొత్తము 6000 రూపాయలకి మరొక 4000 రూపాయలు జమచేసి, పదివేల రూపాయలు విలువ చేసే సౌండ్ సిస్టమ్ ను కొని పాటశాలకు బహూకరించారు. సదరు విద్యార్ధినిల తండ్రులు రామారావు, చంద్రశేఖర్, సోమీశ్వరరావు గురువారము పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆ సౌండ్ సిస్టమ్ ను అందచేశారు. ఈ సందర్భంగా పాటశాల ప్రధానోపాధ్యాయులు కోత చైతన్య మాట్లాడుతూ విద్యార్థులు వారి జీవితములో మొదటిసారి పొందిన క్యాష్ అవార్డ్ మొత్తమును వారు చదువుకున్న పాఠశాలకు వితరణ చేసి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారని, వారు మరిన్ని విజయాలు సాధించి మంచి స్థానములలో స్థిరపడాలని, ఇందుకు సహకరించిన తల్లితండ్రులకు, పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు తరుపున కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కరరావు, వీరభద్రరావు, ఆదికేశవరెడ్డి, తిరుపతిరావు, లక్ష్మీకాంతం, నాగేశ్వరరావు, లక్ష్మి, పార్వతి, రాము, ఉమ, చిన్నారావు, రవికుమార్, మురళీధర్ రాజు, విజయలక్ష్మి, మార్కండేయులు, రోజా, కృష్ణవేణి, CRP గిరి, పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.