నాయుడుపేటలో స్వల్ప భూకంపం
1 min read
భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (మార్చి 15) తిరుపతి జిల్లాలో గురువారం రాత్రి భూకంపం కలకలం రేగింది. దొరవారి సత్రం, నాయుడుపేట సహా పలు ప్రాంతాల్లో 3 సెకన్లపాటు భూమి కంపింది. దీంతో ఇళ్లలోని సామాన్లు కింద పడ్డాయి. కొన్ని చోట్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించడంతో పాటు భారీ శబ్ధం కూడా వచ్చినట్లు చెబుతున్నారు. పలు చోట్ల సిమెంట్ రోడ్లకు బీటలు వచ్చినట్లు తెలిపారు. గతంలోనూ పలుమార్లు తమ జిల్లాలో భూకంపం వచ్చిందని, ప్రతిసారి తామెంతో భయాందోళనకు గురవుతున్నామని అంటున్నారు. అయితే భూకంపం తీవ్రత 4.0-5.0 గా , కొన్ని ప్రాంతాల్లో 3.9 గా, మరి కొన్ని ప్రాంతాల్లో 4.5 – 4.8 గా, రిక్టర్ద స్టీల్ పై భూకంప తీవ్రతనుఅంచనా వేయడం జరిగింది. నాయుడుపేట పట్టణం, మండలంలో వేముగుంట పాలెం గురువారం రాత్రి 8:45 8:50 గం.ని. మధ్య సుమారు రెండు సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించడం జరిగింది. అతిపెద్ద శబ్దంతో ఇల్లు, భవనాలు, సిమెంట్ రోడ్లు , గోడలు పగుళ్లు స్వల్పంగా బీటలు ఏర్పడ్డాయి. దీనితో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చి చర్చించుకోవడం కనిపించింది. ప్రాంతాల్లో ఇళ్లలోని వస్తువులు కూడా కదిలినట్టు , సీలింగ్ ఫ్యాన్ ఊగినట్లు తెలియజేశారు. తిరుపతి జిల్లాలోని ఓజిలి, పెళ్లకూరు, దొరవారిసత్రం, నాయుడుపేట, శ్రీకాళహస్తి, బుచ్చినాయుడు కండ్రిగ తదితర మండలాల్లోని గ్రామాల ప్రాంతాల్లో సైతం స్వల్పంగా భూకంపం సంభవించింది. అటు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయనే విషయంపై ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు తత్ఫలితంగా ఇల్లు వదిలి వీధులు, రోడ్ల మీదకు వచ్చారు. అయినప్పటికీ ప్రాణం నష్టం సంభవించలేదని ఊపిరి పీల్చుకున్నారు.
ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే 08772236007 నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.