ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుడి శంఖారావం ప్రజా చైతన్య యాత్ర 78వ రోజు
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (మార్చి 15) ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుడి శంఖారావం ప్రజా చైతన్య యాత్ర గురువారం 78రోజు సూళ్ళూరుపేట నియోజకవర్గ కన్వీనర్ పట్టపు రవి, తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాలేటి వెంకటస్వామి ప్రచార నిమిత్తం నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో రెండోసారి కరపత్రాలను పంచుతూ ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు గుర్తుకు ఓటు వేసి తిరుపతి పార్లమెంట్ ఎంపీ, సూళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానాలకు ఓటు వేసి గెలిపించమని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాలేటి వెంకటస్వామి మాట్లాడుతూ మీ బిడ్డలకు ఉపాధి, ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య అన్ని సదుపాయాలు ఆమ్ ఆద్మీపార్టీ ద్వారానే సాధ్యమవుతాయని తెలియజేశారు. ఈ సందర్భంగా సూళ్ళూరుపేట నియోజకవర్గ కన్వీనర్ పట్టపు రవి మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి, 75 సంవత్సరాల పైబడిననూ కొన్ని గ్రామాలకు, సూళ్ళూరుపేట నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ,రోడ్ల సమస్య, స్మశాన వాటిక సమస్యలు ఎక్కువగానే ఉంటున్నాయని, ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే పరిష్కరించబడతాయని తెలియజేశారు. సంధర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కమిటీ నాయుడుపేట మండలంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో మోహన్ రాజు, చిరంజీవి, రాజేష్, సందీప్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.