April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయండి: గుడి హరికుమార్ రెడ్డి

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (మార్చి 16) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు గుడి హరికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, చిరంజీవి యువత నెల్లూరు జిల్లా వారి సహకారంతో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో ఆదివారం (రేపు) ఉదయం 09:30 నిమిషాలకు మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడుతుందని హరిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కోవూరు నియోజకవర్గం టీడీపి మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్, ప్రముఖ పాన్ ఇండియన్ కొరియో గ్రాఫర్, జనసేన నాయకుడు జానీ మాస్టర్ వస్తున్నారని, ప్రజలందరూ రక్తదాన శిబిరంలో తప్పకుండా పాల్గొని జయప్రదం చేయాలని హరిరెడ్డి మీడియా ముఖంగా కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *