ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తాం: గుడి హరి కుమార్ రెడ్డి
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (మార్చి 17) 2024 ఎన్నికల్లో జన సైనికులతో కలిసి తనవంతు కృషి చేసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షులు, కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ కేర్ టేకర్ గుడిహరి కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరానికి జన సైనికులు, మెగా అభిమానులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరి కుమార్ రెడ్డి మాట్లాడుతూ రక్త నమూనాల సేకరణలో రాష్టంలోనే గంగపట్నం గ్రామానికి ప్రత్యేక స్థానం ఉందని, పార్టీలకు అతీతంగా రక్తం ఇచ్చేందుకు జనసైనికులు, మెగా అభిమానులు ఎప్పుడు సిద్దంగా ఉంటారని, అన్నీ కార్యక్రమాల్లో తనకు అండగా నిలిచిన జన సైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 2024 ఎన్నికల్లో జన సైనికులతో కలిసి తనవంతు కృషి చేసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. రాబోయేది ప్రజా ప్రభుత్వమని, కోవూరు నియోజకర్గంలో టీడీపీ మరియు జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విజయం తధ్యమని హరి కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి, నాగరత్నం యాదవ్, నందిన యాదవ్, చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, నక్కల శివకృష్ణ, మున్వర్, మాధవ్, శ్రీనాథ, అల్తఫ్, పవన్, సులంబాబు, ఆషీక్, కోవూరు నియోజకర్గం చిరంజీవి యువత, పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షులు లోకేష్ , శ్రీకాంత్, కార్యక్రమ నిర్వాహకులు మారుతి, అష్వక్ నాయబ్, కలిల్ తదితరులు పాల్గొన్నారు.