April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

వైసీపీకి ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది: కార్పొరేటర్ నాగరాజు

1 min read

భీమ్ న్యూస్ నెల్లూరు రూరల్ ప్రతినిధి (మార్చి 18) నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం స్థానిక 1వ డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని మండుటెండలో సైతం జోరుగా నిర్వహిస్తూ, ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు అందించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళినా వైసీపీకి ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని, ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకంతో ప్రతిపక్షాలకు చెమటలు పడుతున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగనన్న బలపరిచిన నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డిని, వైఎస్ఆర్సిపి పార్లమెంటు ఇంచార్జ్ విజయసాయి రెడ్డిని ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనార్టీ నాయకులు షేక్ మౌలాలి, వైకాపా నాయకులు నాపా సుబ్బారావు, మాజీ ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *