టీడీపిలోకి కొనసాగుతున్న వలసలు
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి కనిగిరి (మార్చి 20) ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. మంగళవారం సిఎస్ పురం మండలం పెద్ద రాజుపాలెంకు చెందిన 19 కుటుంబాలు,వెలిగండ్ల మండలం కొత్త కండ్రిగకు చెందిన 17 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.కనిగిరి టీడీపీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పార్టీలో చేరిన వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అభివృద్ధిని ఆకాంక్షించి ప్రజలందరూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్పు కోరుకుంటున్నారు.జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు,సంక్షేమం ముసుగులో జరుగుతున్న దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని, అందుకే ప్రజలు మార్పు కోరుతూ టీడీపీ,జనసేన,బీజేపీ, కూటమితో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.