సిఫార్సు బదిలీలు, సెలవులతో ఏకోపాధ్యాయ పాఠశాలలకు సిఆర్ఎంటి లే దిక్కు
1 min read
భీమ్ న్యూస్ ప్రతినిధి సూళ్లూరుపేట (మార్చి 20) తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కొంతమంది ఉపాధ్యాయులు తమ పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులతో కలిసి, రూ.లక్షల నగదు ముట్టజెప్పి కోరుకున్న పాఠశాలకు ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దాంతో ప్రస్తుతం వారు పనిచేస్తున్న ఏకోపాధ్యాయ పాఠశాలలు మూతపడుతూ ఉన్నాయి. సిఫార్సు బదిలీల్లో ఒకరిద్దరు కాదు. ఏకంగా ఆరుగురు వరకు ఉన్నారు. భారీగా చేతులు మారిన నగదు కారణంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు మూతపడుతున్నాయని, ఏళ్లపాటు ఇక్కడ మనం పనిచేస్తుంటే ఏడాది కూడా విధులు నిర్వహించకుండా, వారు సిఫార్సు బదిలీలపై వెళ్లడమేమిటని మరి కొంతమంది ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ వేగంగా నడుస్తోంది. తాజాగా తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట డివిజన్‌లోని తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు మండలాలు, శ్రీకాళహస్తి డివిజన్ లో తొట్టంబేడు, శ్రీకాళహస్తి, బుచ్చినాయుడు కండ్రిగ, ఏర్పేడు , రేణిగుంట మండలాలు ఉద్యోగులకు ఎంతో అనుకూలం అయినందున రాకపోకలకు రైళ్లు, బస్సులు తదితర వసతులు ఉన్నాయి. అలాంటి మండలాల్లోనే కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల్లేక ఒకరోజు జరిగి ఒకరోజు జరగక మూతపడుతున్నాయి. ఈ సందర్భాల్లో సీఆర్‌ఎంటీలను నియమించి, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సిఆర్ఎంటి లే పూర్తి బాధ్యతలతో పాఠశాలలను నడుపుతున్నారు. అరకొరా జీతాలతో సిఆర్ఎంటి ల పరిస్థితి చెప్పనలివి కానిది. నెలలు కాలాలుగా సైతం డిప్యూటేషన్లు వేస్తున్నారు.
గతేడాది జరిగిన ఉపాధ్యాయుల సాధారణ బదిలీల్లో పలువురు నెల్లూరు ప్రాంతం నుంచి సూళ్లూరుపేట డివిజన్‌కు వచ్చారు. వీరిలో పలువురు పట్టుమని రెండు నెలలు కూడా పనిచేయలేదు. కొందరు దీర్ఘకాలిక సెలవులపై వెళ్తే, మరికొందరు పైరవీలు చేయించుకుని కోరుకున్న ప్రాంతానికి బదిలీపై వెళ్లారు. దాంతో ఆ పాఠశాలలు మూతపడ్డాయి. చేసేదిలేక ఎంఈవోలు ఇతర పాఠశాలల నుంచి కొందరి ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై వంతుల వారీగా పంపుతూ వచ్చారు. మరిన్నిచోట్ల సీఆర్‌ఎంటీలను నియమించి, పాఠశాలలు మూతపడకుండా చర్యలు చేపట్టారు. సుదూర ప్రాంతాల పాఠశాలలకు సైతం సిఆర్ఎంటీలను డిప్యూటేషన్ వేయడం పట్ల పూర్తి ఆవేదన చెందుతున్నారు. కనీసం మండలానికి 30 కిలోమీటర్ల దూరం సైతం ప్రతిరోజు డిప్యూటేషన్లు పోవడం మూలంగా వచ్చిన జీతాలు పెట్రోల్ ఖర్చులకు సైతం చాలడం లేదని సిఆర్ఎంటిలు వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సీఆర్పిలను సిఆర్ఎంటిలుగా మార్చిన కారణంగా వచ్చే అరకొర జీతాలు సరిపోక అప్పుల పాలు అవుతున్నారని సిఆర్ఎంటిలు ఆవేదన చెందుతున్నారు. సిఆర్ఎంటిలుగా మార్చిన వెంటనే పాఠశాలల బాధ్యత పూర్తిగా సీఎంఆర్టీ ల పైనే ఎంఈఓలు వేస్తున్నారని, పాత విధులతోపాటు డిప్యూటేషన్ విధులను పూర్తిగా నిర్వహించాలని ఎంఈఓ లు సిఆర్ఎంటిపై పూర్తి ఒత్తిడిని ప్రదర్శిస్తున్నారు. ఈ కారణంగా కొన్ని మండలాల్లో సిఆర్ఎంటిలు, గుండెపోటు, పక్షవాతం, బీపీ, షుగర్ వంటి లక్షణాలుతో ఆసుపత్రి పాలవుతున్నారని ఆవేదనను బయటకు వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో మండల స్థాయి విద్యాశాఖ అధికారుల ఉద్యోగ ఒత్తిడితోరెండు రోజుల క్రితం స్వల్పహార్ట్ స్ట్రోక్ తో డక్కిలిమండల సిఆర్ఎంటీ ఎన్ బి రమేష్ హాస్పిటల్లో వైద్యం అనుకుంటున్న వైనం ఈ సందర్భంగా జరిగిందని, పని భారం కొండంతగాను వచ్చే జీతం గొర్రె తోకంతగాఉందని, చెవిటి వాని చెవిలో శంఖం ఊదినంతగా ప్రభుత్వం వ్యవహరించే తీరు ఉద్యోగం మీద విరక్తిని పెంచుతోందని సిఆర్ఎంటిలు పూర్తి బాధను వ్యక్తం చేస్తున్నారు. మండలానికి ఇద్దరు ఎంఈఓ లు కారణంగా ఉపాధ్యాయులను సమన్వయ పరిచే బాధ్యతలో వెనకడుగు ముందడుగు అంటూ విద్యా వ్యవస్థ పూర్తిగా వెనక్కి పోయిందని, విద్యాశాఖలో మండల, జిల్లా స్థాయి అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ ఇటువంటి లోపాలను కపిపుచ్చుతున్నారని కూడా తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.
రూ.7 లక్షల వరకు:
తాజా బదిలీల్లో భారీగా నగదు చేతులు మారింది. గతంలో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో విధులు నిర్వహించి, ప్రస్తుతం విద్యాశాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారితో పాటు మంత్రి, మరికొందరు ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములైనట్లు సమాచారం. ఒక్కో ఉపాధ్యాయుడు రూ.5-7 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారంగాతెలుస్తోంది.
బదిలీలకు ఇవే రుజువులు:
- సూళ్లూరుపేటలోని మన్నారుపోలూరు జడ్పీ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయినికి మూడు రోజుల క్రితం నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం పాఠశాలకు, సూళ్లూరుపేట మండలం అచ్చుకట్లకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయినికి నెల్లూరు జిల్లా సిద్ధవరానికి బదిలీ చేసినట్లు ఉత్తర్వులు అందాయి.
- తడ మండలం కారిజాత ఎంపీయూపీఎస్, పల్లెపేటకుప్పం ప్రాథమిక పాఠశాల, దొరవారిసత్రం మండలం బూదూరు ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను బదిలీ చేశారు
- ఓవైపు పరీక్షలు, మరోవైపు ఎలక్షన్లు, ఇంకోవైపున ఒంటిపూటు బడులతో పాఠశాలలు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.