April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

పదవ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి రాజుపాలెం (మార్చి 19) ఆరోగ్యమే మహాభాగ్యం లేనటువంటి ఈ రోజుల్లో, కారెవ్వరు అనర్హులు  గుండెపోటుకి  అని అన్నట్లుగా గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఏపీ రాష్ట్రంలోని వైఎస్సాఆర్ కడప జిల్లా రాజుపాలెం మండలంలో చోటు చేసుకుంది. కొర్రపాడులో పదో తరగతి చదువుతున్న లిఖిత (15) గుండెపోటుతో మృతి చెందింది. అయితే విద్యార్థిని నిన్న పరీక్ష రాసిన అనంతరం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థినిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థిని చనిపోయిందని ధృవీకరించారు. పదో తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందిన ఘటనతో తల్లిదండ్రుల ఆశలు అడియాసలై, తీవ్ర ఆవేదనతో బంధువుల్లో, స్థానికుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *