April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

సీఎం జగన్ సమక్షంలో వైకాపాలో చేరిన జనసేన నాయకులు

1 min read

భీమ్ న్యూస్ తాడేపల్లి ప్రతినిధి (మార్చి 20) జనసేన పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. శేషుకుమారి 2019 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అలాగే రాధా – రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం జగన్, శేషుకుమారికి, వంగవీటి నరేంద్రకు వైఎస్సార్సీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరిద్దరూ జనసేన నాయకులే కావడం విశేషం. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కో- ఆర్డినేటర్‌ పి.వి. మిథున్‌రెడ్డి, పిఠాపురం వైఎస్‌ఆర్‌సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *