April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

అనధికారికంగా తవట ఎత్తుతున్న కాంట్రాక్టర్ ను అడ్డుకున్న గ్రామ మహిళలు

1 min read

భీమ్ న్యూస్ ఇందుకూరుపేట ప్రతినిధి (మార్చి 20) ఆంధ్రప్రదేశ్లో మట్టి, ఇసుక, తవట ఇప్పుడు బంగారం కంటే విలువైనవి. అవి ఎక్కడ కనిపించినా దోపిడీకి గురౌవుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో రావూరు పంచాయతీ సుజాత నగర్ కి దగ్గరలో కొమరిక రెవిన్యూ పరిధిలోని శివాయి పోరంబోకు ప్రభుత్వ భూమిలో ఒక కాంట్రాక్టర్ జెసిబి, ట్రాక్టర్లలను పెట్టి తవటను ఎత్తుతున్న క్రమంలో స్థానిక మహిళలు అడ్డగించారు. గతంలో ఈ స్థలం సుజాత నగర్ ప్రజలకు శ్మశాన భూమికి కేటాయించి వున్నారని, ఆ స్థలం ప్రస్తుతం మహిళలు బహిర్భూమికి వాడుతున్నారని మహిళలు మీడియాకి తెలిపారు. ఈ విషయంలో కొమరిక గ్రామ పంచాయతీ రెవిన్యూ అధికారి మల్లిఖార్జున ను మీడియా వివరణ కోరగా తవట ఎత్తండం తనకు తెలుసునని, అది పట్టా పొలం అని, కాకపోతే తవట ఎత్తుకునేందుకు రెవిన్యూ శాఖ నుండి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. పట్టా పొలం ఐనా, ప్రభుత్వ భూమి ఐనా సరే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో వున్న నేపథ్యంలో ఇలా ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా తవట ఎత్తడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని కదా అని గ్రామ ప్రజలు చర్చించుకోవడం పలు విమర్శలకు దారితీసింది. ఈ అక్రమాలపై ఇందుకూరుపేట మండల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, మండల రెవిన్యూ అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *