April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

భీమ్ న్యూస్ ఇందుకూరుపేట ప్రతినిధి (మార్చి 20) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కోమరిక గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 75 పొలంలో అనుమతులు లేకుండా తవట ఇసుక ఎత్తుతున్నారని భీమ్ మీడియాలో వచ్చిన వార్తకు స్పందించిన అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చర్యలు చేపట్టి తవట అక్రమ రవాణా చేయకుండా అడ్డుకున్నారు. పొలానికి సంబంధించిన పత్రాలు సమర్పించి, రెవిన్యూ శాఖలో తగిన అనుమతులు తీసుకున్న తరువాతనే తవట ఎత్తుకోవాలని కాంట్రాక్టర్ కి సూచించి, జే.సీ.బీ. ట్రాక్టర్లను పంపించిన పిదప సుజాత నగర్ గ్రామ మహిళలకు సర్ది చెప్పి సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొమరిక రెవిన్యూ అధికారి మల్లిఖార్జున, రావూరు పంచాయతీ వైఎస్సార్సీపీ నాయకుడు ఉడతా వెంకట శేషయ్య లు ప్రధాన పాత్ర పోషించారు. వేగంగా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న మండల అధికారులకు, వైకాపా నాయకుడు ఉడతా వెంకటశేషయ్యకు సుజాత నగర్ గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *