April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

రీ – సర్వేతో బయటపడ్డ ఆసక్తికర విషయాలు

1 min read

భీమ్ న్యూస్ ఇందుకూరుపేట ప్రతినిధి (మార్చి 20) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 780 లో 31 సెంట్లు చుక్కల భూమి వున్నది. ప్రభుత్వ అధీనంలో వున్న ఈ భూమి అన్యాక్రాంతం అయినది, మండల అధికారులు దీన్ని రీ – సర్వే చేసి అన్యుల ఆక్రమణల నుండి చుక్కల భూమిని విడిపించి, ప్రభుత్వాధీనంలోకి తీసుకోవాలని ఓ పౌరుడు జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో మండల తహశీల్దారుకి అర్జీ ఇచ్చారు. దీనిపై నేడు మండల సర్వేయర్ హరినాధ్ తన సిబ్బందితో కలిసి వెళ్ళి సర్వే నంబర్ 780 చుక్కల భూమికి వున్న సరిహద్దులను రీ సర్వే చేయగా, ఆసక్తికరమైన విషయాలు బయటకు తెలిశాయి. ఓ ప్రైవేటు లే – అవుట్ కి సంబంధించిన కార్యాలయం ఈ స్థలంలోనే నిర్మాణం జరిపి తన కార్యకలాపాలను యధేచ్చగా నిర్వహించుకుంటున్నారు. అలాగే ఆ లే – అవుట్ ముఖ ద్వారం కూడా ఈ చుక్కల భూమిలోనే నిర్మాణం చేశారు. నెల్లూరు రూరల్ మండల పరిధిలోని సర్వే నంబర్ 236/1 భూమి యజమానులు తన స్థలానికి సంబంధించిన ప్రహరీ గోడలో కొంత భాగం ఈ చుక్కల భూమిలోనే నిర్మాణ చేయడం విశేషం. ఇలా అన్యులు చుక్కల భూమిని పూర్తిగా ఆక్రమించుకున్న విషయం బహిర్గతమైంది. మండల తహశీల్దారుకి ఒక పౌరుడు ఇచ్చిన అర్జీతో బయటపడిన ఈ ఆక్రమణలను అధికారులు తొలగించి, ఆ భూమిని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటారో.. లేదో వేచి చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *