హీరాపురం యువత 15 వేలు చేయూత
1 min read
భీమ్ న్యూస్ మెలియాపుట్టి ప్రతినిధి (మార్చి 20) శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం హీరాపురం గ్రామస్తులు ధనకానహత్తి నాగరాజు, నీలవేణి దంపతులు గత కొన్ని రోజులు క్రితం రోజు వారి కూలీ పనికి వెళ్ళి వస్తుండగా మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది. వీళ్లది నిరుపేద కుటుంబం, ఇరువురుకి గాయాలు, భార్యకి కాలు ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పిన విషయం తెలుసుకున్న హీరాపురం యువత ముందుకు వచ్చి వాళ్ళ, వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగి సోమవారం పళ్ళు మరియు 15000/- రూపాయలు నగదును బాధితులకు అందివ్వడం జరిగింది. కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ పేద కుటుంబాన్ని దాతలు ముందుకు వచ్చి మానవత్వంతో ఆదుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మిపురం కిరణ్, వట్టికుళ్ల సాయి, లక్ష్మణ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.