April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

గత 25 ఏళ్ళ చరిత్రను తిరగ రాద్దాం: పులివర్తి నాని

1 min read

 

          భీమ్ న్యూస్ ప్రతినిధి  చంద్రగిరి (మార్చి 20)  తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని చంద్రగిరిలో స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలను, ఆత్మీయులను కలిశారు. సీనియర్ నేతల సూచనలు, సలహాలు తీసుకున్నారు. అందరిని కలుపుకుంటూ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశారు. అందరు సమిష్టిగా కృషి చేస్తే భారీ మెజార్టీ సాధించవచ్చని పులివర్తి నాని ధీమా వ్యక్తం చేశారు. 25ఏళ్ల చరిత్ర తిరగరాద్దామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *